Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.బాల నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగిన మహేష్ బాబు అనంతరం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.ఇకపోతే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
మహేష్ బాబుకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక ఏడాదిలోనే తన ఫ్యామిలీ మొత్తం ముగ్గురు మరణించడంతో మహేష్ బాబుకి దెబ్బ పై దెబ్బ పడుతుంది. జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో రమేష్ బాబు మరణించడం ఘట్టమనేని కుటుంబానికి తీరనిలోటు.
ఈ విధంగా మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించిన సంఘటన నుంచి కోలుకోక ముందే తన తల్లి ఇందిరా దేవి మరణించడం బాధాకరం.ఇందిరా దేవి మరణించిన సమయంలో మహేష్ బాబు ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే తన తల్లి మరణ వార్త నుంచి బయటపడుతూ సినిమాలలో బిజీ కానున్న మహేష్ బాబుకి మరో దెబ్బ ఎదురయింది.
మహేష్ బాబు తండ్రి నటుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడచడం అందరిని శోకసంద్రంలోకి ముంచింది. ఇలా తల్లి మరణ వార్త నుంచి కోలుకోక ముందే తిరిగి తండ్రి మరణించడంతో మహేష్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు మహేష్ అన్నకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా దెబ్బ పై దెబ్బ పడటం నిజంగా బాధాకరం అంటూ అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…