Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వరస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేష్ బాబు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇకపోతే మహేష్ బాబు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూనే తనకు ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో తన భార్య పిల్లలతో కలిసి మహేష్ బాబు స్పెయిన్ వెళ్లారు. అదేవిధంగా మహేష్ బాబు నమ్రతల 18వ వివాహ వార్షికోత్సవం కావడంతో ఈ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో మహేష్ ఫ్యామిలీ సందడి చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు 18వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా తన భార్య నమ్రతకు ఎంతో ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.ఇక మహేష్ బాబు నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు కన్నా నమ్రత వయసులో పెద్దది అయినప్పటికీ ఈ దంపతులు మాత్రం వీరి జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
మహేష్ బాబు నమ్రత వంశీ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇలా ఈ సినిమా అనంతరం వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న అనంతరం ఈ జంట 2005 వ సంవత్సరంలో అది కొద్ది మంది సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.వివాహం తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఓ కోడలిగా భార్యగా అమ్మగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇంటి లోపల చిన్నారి ఉంటే డైపర్లు వాడటం ఇప్పుడు సాధారణంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగస్త తల్లిదండ్రులకు ఇది ఎంతో సౌకర్యం…
ప్రపంచ ఆర్థిక గణాంకాలను ప్రభావితం చేసే ఒక అంశం “బంగారు నిల్వలు” (Gold Reserves). యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల…
ఇంట్లో చిన్నారి పుట్టిన క్షణం నుంచి ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు ఒక ముఖ్యమైన చర్చ కూడా…
కాలేయం (లివర్) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…
దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…