Featured

Kirrak RP : నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్… నెక్స్ట్ అమెరికాలోనే…: హైపర్ ఆది, అదిరే అభి

Kirrak RP : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు మరో బ్రాంచ్ ను ఏర్పాటు చేసారు ఆర్పీ.

అమెరికాలో కూడా పెట్టాలని కోరిక…

నెల్లూరు చేపలతో చేసిన పులుసు అంటూ మార్కెటింగ్ చేసిన ఆర్పీ మొత్తానికి బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు. కూకట్ పల్లి బ్రాంచ్ తరువాత ఇప్పుడు మరో బ్రాంచ్ ను మణికొండలో పెట్టాడు. సినిమా వాళ్ళు ఎక్కువగా ఉండే మణికొండ బ్రాంచ్ బాగా క్లిక్ అవుతుందంటూ అక్కడికి వచ్చిన అతిధులు ఆశించారు. రెండో బ్రాంచ్ ఓపెనింగ్ కి వచ్చిన జబర్దస్త్ కమెడియన్స్ అదిరే అభి, హైపర్ ఆది చేపల పులుసు గురించి కిర్రాక్ ఆర్పీ గురించి మాట్లాడారు. హైపర్ ఆది మాట్లాడుతూ చేపల పులుసు చాలా బాగా ఉందంటూ చెప్పాడు.

ఆర్పీ జబర్దస్త్ లో ఉన్న సమయంలోనే ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటుండేవాడు, ఇలా పెట్టి సక్సెస్ అయిననందుకు హ్యాపీగా ఉంది అంటూ తెలిపారు. ఇక అదిరే అభి మాట్లాడుతూ ఆర్పీ బిజినెస్ చాలా బాగా జరుగుతోందని, డిమాండ్ ఎక్కువైపోవడం వల్ల హోటల్ మూసేయాల్సి రావడం మొదటి సారి చూసినంటూ చెప్పారు. ఇక తాను ఇంకో 17 బ్రాంచ్ లు పెట్టాలనుకుంటున్నాడు అయితే ఓవర్సీస్ లో కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. అమెరికాలో మన ఫుడ్డు కోసం తపించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అక్కడ నెల్లూరు చేపల పులుసు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago