Ashok Galla: ఘట్టమనేని కుటుంబం నుంచి ఇది వరకే హీరోగా మరో వారసుడు ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ప్రముఖ మాజీ రాజ్యసభ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈయన తన రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
దేవకీ నందన వాసుదేవ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అశోక్ ఫ్యామిలీ గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు భార్య నమ్రత గురించి ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒక మాటలో చెప్పాలి అంటే నమ్రత అత్తయ్య కారణంగానే నేను హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని అశోక్ వెల్లడించారు. నేను ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నాను ఆ సమయంలో నమ్రత అత్తయ్య నాకు ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు ఇండస్ట్రీలోకి వెళ్తే ఎలా ఉండాలి ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాల గురించి నాకు తెలియచేస్తూ నన్ను బాగా సపోర్ట్ చేశారు.
సపోర్ట్ చేస్తుంది..
నేను హీరోగా వద్దామనుకునే ముందు బాగా జుట్టు పెంచి పోర్ట్ ఫోలియో తీయించుకుందాం అనుకున్నాను. సింపుల్ గా చెన్నై వెళ్లి తీసుకుందాం అనుకున్నాను. కానీ నమ్రత అత్త ముంబై వెళ్లి నా హెయిర్ స్టైలింగ్ చేయించుకొని ప్రాపర్ అఫీషియల్ పోర్ట్ ఫోలియో చేపించమని చెప్పింది. ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ సపోర్ట్ కూడా చేసిందని అశోక్ వెల్లడించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…