Political News

Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం.. అదే లక్ష్యమా?

Pawan Kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈయన ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకొని మరి బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. ఈ విధంగా ఏపీలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఈయన పోటీ చేసిన ప్రతి ఒక్క చోట అద్భుతమైన మెజారిటీతో గెలిచారు.

ఇలా ఏపీలో 100% విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఎంతో కీలకంగా మారారు.దీంతో పవన్‌ కల్యాణ్ క్రేజ్‌ ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ప్రధాని మోదీ ఉపయోగించుకోవాలని ప్లాన్‌ చేసింది. త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బాగుంటుందని మోడీ సర్కార్ భావించినట్టు తెలుస్తోంది.బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మహావికాస్‌ అఘాడీని ఎదురించి ఎలాగైనా తమ అధికారాన్ని అందుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది.

ఎన్నికల ప్రచారంలో పవన్..
ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.ఇదే విషయమై పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ అధిష్ఠానం సంప్రదిస్తే ఓకే కూడా చెప్పేశారు. దీని ప్రకారం నవంబర్‌ 16, 17వ తేదీల్లో పవన్‌ కల్యాణ్‌ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మహారాష్ట్రలో ఎక్కడైతే తెలుగు వారు అధికంగా ఉంటారో ఆయా ప్రాంతాలలో పవన్ పర్యటించబోతున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

8 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

9 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

16 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

16 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

17 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago