Pawan Kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈయన ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకొని మరి బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. ఈ విధంగా ఏపీలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఈయన పోటీ చేసిన ప్రతి ఒక్క చోట అద్భుతమైన మెజారిటీతో గెలిచారు.

ఇలా ఏపీలో 100% విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఎంతో కీలకంగా మారారు.దీంతో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ప్రధాని మోదీ ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బాగుంటుందని మోడీ సర్కార్ భావించినట్టు తెలుస్తోంది.బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మహావికాస్ అఘాడీని ఎదురించి ఎలాగైనా తమ అధికారాన్ని అందుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది.
ఎన్నికల ప్రచారంలో పవన్..
ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.ఇదే విషయమై పవన్ కల్యాణ్‌ను బీజేపీ అధిష్ఠానం సంప్రదిస్తే ఓకే కూడా చెప్పేశారు. దీని ప్రకారం నవంబర్ 16, 17వ తేదీల్లో పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మహారాష్ట్రలో ఎక్కడైతే తెలుగు వారు అధికంగా ఉంటారో ఆయా ప్రాంతాలలో పవన్ పర్యటించబోతున్నారని తెలుస్తోంది.































