Anchor Ravi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ రవి ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా ఎంతోమంది అమ్మాయిలు ఉన్నప్పటికీ మేల్ యాంకర్లుగా మంచి గుర్తింపు పొందిన వారిలో ప్రదీప్ రవి వంటి వారు ఒకరు చెప్పాలి. ఇక యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రవి గతంలో బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవి పాజిటివ్ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువగా అందుకొని బయటకు వచ్చారని చెప్పాలి. ఇక ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న ఈయన నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన భార్య కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే రవి తాజాగా తన కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను న్యూ బిగినింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా తన భార్యతో కలిసి ఈయన కొత్త ఇంట్లో హోమం ఇతర పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.
ఇలా తన భార్యతో పూజ కార్యక్రమాలలో పాల్గొన్న ఫోటోలతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఈయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…