Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.
ఇలా మహేష్ బాబు తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా నమ్రత మాత్రం మహేష్ బాబుకు సంబంధించిన విషయాలతో పాటు పిల్లలు, కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా వీరి బిజినెస్ లు అన్నింటినీ కూడా నమ్రతని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు.
ఇలా మహేష్ బాబు నమ్రత దంపతులు ఇప్పటికే భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారనే సంగతి మనకు తెలిసిందే .వీరు హైదరాబాద్ లో మాత్రమే కాకుండా బెంగళూరు చెన్నై వంటి నగరాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఆస్తులను కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇక నమ్రతకు సంబంధించి ముంబైలో కూడా పెద్ద ఎత్తున ప్రాపర్టీలు ఉన్నాయట.
ఇకపోతే తాజాగా హైదరాబాదులోని శంకర్ పల్లి సమీపంలో ఈ దంపతులు 2.5 ఎకరాల పొలం కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పొలం రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి పనులను పూర్తి చేయడం కోసం నమ్రత బుధవారం శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు వచ్చారు. ఇలా ఈమె వచ్చారు అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని ఆమెతో సెల్ఫీలు దిగారు. అలాగే ఎమ్మార్వో ఆఫీస్ లోని సిబ్బంది కూడా నమ్రతతో కలిసి ఫోటోలు దిగారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…