Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలనమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎంతోమంది సినీ స్టార్స్ అందరూ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. అయితే తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చూశారని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
కల్కి ఓ అద్భుతం.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. లోని ప్రతి ఫ్రేమ్ కళాఖండంలా ఉంది. అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు. కమల్ హాసన్ ప్రతి పాత్రకు ప్రాణం పోస్తారు. ప్రభాస్ గొప్ప క్యారెక్టర్‌లో చాలా సులభంగా నటించారు. ఇక దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా నటించింది. ఇంతటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
కల్కి ఓ అద్భుతం…
ఈ విధంగా మహేష్ బాబు ఈ సినిమా గురించి చేసిన ఈ పోస్ట్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు.మీ అభినందనలు అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది అని రిప్లై ఇచ్చారు. అలాగే కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా మహేశ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపింది . ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…