Movie News

ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన మహేష్ బాబు.. రిపీట్ కాకూడదంటూ వార్నింగ్?

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన్నప్పటికీ మొదటి షెడ్యూల్ ని మాత్రమే పూర్తిచేసుకుంది.

కరోనా కారణం చేత సినిమా షూటింగ్ వాయిదా పడింది.ప్రస్తుతం రెండవ షెడ్యూల్ విదేశాలలో ప్లాన్ చేయడంతో పరిస్థితులు అనుకూలించక రెండవ షెడ్యూల్ లో పలు మార్పులు చేసి హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.

పని విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపించే మహేష్ బాబు ఒక విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై చిత్ర బృందానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మహేష్ బాబు నటిస్తున్నటువంటి సర్కారీ వారి పాట చిత్రానికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు ఇప్పటికే ఎన్నోసార్లు లీకైన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా సినిమా నుంచి ఫోటోలు వీడియోలు లీక్ కావడంతో మహేష్ బాబు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై మహేష్ బాబు చిత్ర బృందం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయమై మరొకసారి రిపీట్ అయితే బాగుంటుంది చిత్ర బృందాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గోదావరి తీరాన అద్భుత క్షేత్రం.. కుండలేశ్వర స్వామి ప్రత్యేకతలు!

ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…

58 seconds ago

ఇద్దరితో ప్రేమ.. ఇద్దరితో పెళ్లి.. కమల్ హాసన్ లైఫ్ స్టోరీ వైరల్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…

6 minutes ago

సప్లిమెంట్స్ కొనుగోలు ముందు అలర్ట్.. లేబుల్ తప్పనిసరి!

ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…

10 minutes ago

మహిళల్లో పెరుగుతున్న థైరాయిడ్.. మందులతో పాటు డైట్ కూడా ముఖ్యం!

ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…

27 minutes ago

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…

3 hours ago

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

5 hours ago