Mahesh Babu Son Gautham: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు నమ్రత దంపతులకు గౌతమ్ సితార ఇద్దరు పిల్లలు కలరు.ఇక సితార ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే గౌతమ్ సీతారా మాదిరి కాదు.గౌతమ్ చూడటానికి చాలా సైలెంట్ గా ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఇక ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినా స్కూల్లో జరిగే పలు కార్యక్రమాలలో చాలా యాక్టివ్ గా ఉంటారని కేవలం చదువు విషయంలోనే కాదు ఇతర విషయాలలో కూడా యాక్టివ్ గా ఉంటారని తెలుస్తోంది.
తాజాగా గౌతమ్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా వేదికపై గౌతమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఎన్ని రోజులకు గౌతమ్ తన టాలెంట్ బయట పెట్టారంటూ కామెంట్ చేయగా, మరికొందరు ఈయన కూడా మహేష్ బాబు లాగే గొప్ప నటుడు అవుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే బాల నటుడిగా గౌతమ్ చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో వన్ నేనొక్కడినే సినిమాలో నటించి సందడి చేశారు. ఈ సినిమా అనంతరం గౌతమ్ ఎలాంటి సినిమాలలో కనిపించలేదు. ప్రస్తుతం గౌతమ్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలలో చదువుతున్న సంగతి తెలిసిందే.ఇక చదువులు పూర్తి అయిన అనంతరం ఈయన మహేష్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…