Featured

మహేష్, త్రివిక్రమ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట” చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఈ చిత్రం పూర్తి కాగానే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఇదివరకే వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ, టీవీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.అయితే ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు టైటిల్ ఇదే అంటూ ఒక టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు రెండు మూడు టైటిల్స్ వినిపించినప్పటికీ.. ప్రస్తుతం ఈ సినిమాకు “అతడే పార్ధు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడం కోసం పలువురు తారల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి త్రివిక్రమ్ మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఎవరు నటిస్తారనే విషయం పై అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

7 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

7 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

8 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

8 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

8 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

8 hours ago