కన్నడ నటుడు యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తో సినిమా చేయనున్నారని ప్రకటించారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా, పాన్ ఇండియా చిత్రంగా ప్రశాంత్ నీల్ “సలార్” అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ తరువాత కరోనా కారణం వల్ల వాయిదా పడింది. అయితే ఈ సమయంలో దర్శకుడు ఈ సినిమా కథలో భారీగా మార్పులు చేశారని తెలుస్తోంది.
మొదటిగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనే విషయాన్ని చెప్పినప్పటికీ, కరోనా సమయంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ను చాలా హైలెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ తారలు నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు? ఏమిటి? అనే విషయాలను చిత్రబృందం తెలియజేయాల్సి ఉంది.
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణలో పాల్గొననున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…