దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. మన్యంపులి అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ సందడి చేయగా, గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు.
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అలియాభట్ ఈ సినిమాలో సీతమ్మ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది.
ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో ఈ సినిమా మిగిలిన షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ చిన్నది అలియాభట్ ప్రమోషన్ సాంగ్ షూటింగ్ తో పాటు ప్యాచ్ వర్క్ ఉంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని తిరిగి ముంబై పయనమైనట్టు తెలుస్తోంది.
అలియా భట్ “ఆర్ఆర్ఆర్”షూటింగ్ పూర్తి కావడంతో ముంబై వెళ్లిన ఈమె తిరిగి సినిమా ప్రమోషన్ లో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ సమయంలో సుమారు పది రోజుల పాటు హైదరాబాద్ లో ఉండి సినిమా ప్రమోషన్లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా పనులను పూర్తి చేసి ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్ 13న సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకధీరుడు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…