Featured

నన్ను అందుకే బొత్స సత్యనారాయణ బినామీ అంటుంటారు.. అసలు నిజాలు చెప్పిన బండ్ల గణేశ్

బండ్ల గణేశ్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే బండ్ల గణేశ్.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు నిర్మాతగా మారి.. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన సినిమాలను నిర్మించారు. అయితే.. బండ్ల గణేశ్ ను అందరూ బొత్స సత్యనారాయణ బినామీ అంటుంటారు. అసలు.. బొత్సకు, బండ్ల గణేశ్ కు సంబంధం ఏంటి? అనేది చాలామందికి తెలియదు.

బొత్స సత్యనారాయణకు నేను బినామీని కాదు. నేను ఆంధ్రా బ్యాంకుకు బినామీని. ఎందుకంటే.. ఆంధ్రా బ్యాంకు నుంచి నేను లోన్ తీసుకొని సినిమాలు నిర్మిస్తుంటా. నేను సినిమాలు నిర్మిస్తున్న సమయంలోనే బొత్స సత్యనారాయణ పరిచయం అవడం.. ఆయనతో చాలాసార్లు మాట్లాడటంతో.. అందరూ నన్ను ఆయన బినామీని అనుకున్నారు కానీ.. నేను ఆయన బినామీని కాదు. ఇప్పటికీ ఇంకా నన్ను ఆయన బినామీగానే అనుకుంటున్నారు అంటూ అసలు నిజం చెప్పుకొచ్చారు బండ్ల గణేశ్.

సుస్వాగతం సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడింది

బండ్ల గణేశ్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. దానికి కారణం.. పవన్ కు, బండ్ల గణేశ్ కు మధ్య ఉన్న అనుబంధం. అయితే.. బండ్ల గణేశ్.. పవన్ కళ్యాణ్ మధ్య పరిచయం ఏర్పడింది ఎప్పుడో తెలుసా? సుస్వాగతం సినిమా సమయంలో. ఆ సినిమాతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. అది అలాగే.. కంటిన్యూ అయిందట. తర్వాత బండ్ల గణేశ్ ఏదైనా సినిమా తీస్తావా? నిర్మాతగా మారుతావా? అని అనగానే.. బండ్ల గణేశ్ ఎగిరి గంతేసి.. పవన్ తో సినిమాలు తీయడం మొదలు పెట్టారట. అలా.. బడా నిర్మాతగా బండ్ల గణేశ్ మారారు.

చిన్నప్పటి నుంచి సినిమా అంటే వ్యసనం

చిన్నప్పటి నుంచి సినిమాలంటే మాత్రం చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యసనం. మాది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే. మాకు అప్పట్లోనే పౌల్ట్రీ ఫామ్ లు ఉండేవి. అయితే.. నాకు మాత్రం సినిమాల్లోకి రావాలని.. నటుడు కావాలని కోరిక ఉండేది. అలా సినిమాల్లోకి వచ్చా. ముందు కేఎస్ రామారావు దగ్గర మేనేజర్ గా పనిచేశా. అక్కడ జీతం లేకుండా పనిచేశా. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి నాకు వేషాలు ఇచ్చారు. అలా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా అడుగు పెట్టా.. అని బండ్ల గణేశ్ తెలిపారు.

ఇన్ కమ్ ట్యాక్సే కోట్లు కట్టాను

బండ్ల గణేశ్ అప్పట్లో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించి బాగా లాభాలు సంపాదించారు. ఆయన తీసింది మొత్తం 8 సినిమాలు. పవన్ కళ్యాణ్ తో 2 సినిమాలు, ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, అల్లు అర్జున్ తో ఒక సినిమా, రవి తేజతో ఒకటి, రామ్ చరణ్ తో ఒకటి సినిమా నిర్మించి బడా నిర్మాతగా మారారు బండ్ల గణేశ్. అయితే.. బండ్ల గణేశ్.. ఈ సినిమాలు నిర్మించిన తర్వాత కోట్లు సంపాదించి ఇన్ కమ్ ట్యాక్స్ కట్టలేదని ఇన్ కమ్ టాక్స్ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారు. అయితే.. ఇన్ కమ్ ట్యాక్స్ 10 కోట్లు కట్టారట బండ్ల గణేశ్. త్వరలోనే మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నారట బండ్ల గణేశ్. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago