Malashree: ఫిబ్రవరి 10వ తేదీ ఎంతో మంది సెలబ్రిటీ కపుల్స్ తమ వెడ్డింగ్ యానివర్సరీ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు నమ్రత దంపతులకు ఫిబ్రవరి 10వ తేదీ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో వీరి 18 వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఇలా వీరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం కోసం ఏకంగా స్పెయిన్ వెళ్లారు.అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ కనకాల దంపతులు కూడా ఫిబ్రవరి 10వ తేదీ 24వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారని తెలుస్తోంది.
ఇలా సుమ రాజీవ్ దంపతులు కూడా తమ పెళ్లి వార్షికోత్సవాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోని అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మాలాశ్రీ ప్రొడ్యూసర్ రాముని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
1997 ఫిబ్రవరి 10వ తేదీ మాలాశ్రీ నిర్మాత రాము వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10వ తేదీ ఈమె తన వివాహ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకొని తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.నేను నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను నిన్ను బాగా మిస్ అవుతున్నాను అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.ఎంతో సంతోషంగా ఉన్న వీరి జీవితంలో కోవిడ్ మహమ్మారి కలత రేపింది. 2021 వ సంవత్సరంలో కోవిడ్ కారణంగా
మాలాశ్రీ భర్త రాము మరణించిన విషయం విధితమే.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…