సాధారణంగా పెళ్లి అంటే వధువు వరుడు ఎంతో అందంగా ముస్తాబు అవుతారు.పెళ్లికి వచ్చిన అతిథుల దృష్టి వారి పైనే ఉండాలనే ఉద్దేశంతో వారి దుస్తుల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా పెళ్లి వేడుక కోసం కొందరు ప్రత్యేకంగా బట్టలను డిజైన్ చేయించుకుంటారు. ఈ విధంగా ఓ వధువు తన పెళ్లి కోసం అందమైన గౌను ధరించి బుట్ట బొమ్మలా తయారయింది. ఈ విధంగా వధువు తయారయ్యే వేదిక దగ్గరకు రాగానే వరుడు ఆమె చేతిని పట్టుకొని వేదికపైకి వెళ్తున్న సమయంలో ఆమె గౌను నుంచి ఓ వ్యక్తి బయటకు వెళ్ళిన ఘటన ఫిలిప్పీన్స్‌లో చోటు చేసుకుంది. ఈ విధంగా వధువు గౌనులో నుంచి వ్యక్తి బయటికి రావడంతో అక్కడున్న బంధువులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. చివరికి అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…
ఫిలిప్పీన్స్‌లో జరిగిన పెళ్లిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. రోయల్ లునేసా అనే వ్యక్తి ‘బ్రోస్ బ్రైడల్ గౌన్స్ అండ్ ఇవెంట్స్’లో పని చేస్తున్నాడు. తాజాగా ఈ సంస్థ వధువుకు పెళ్లి గౌను డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే వధువు పెళ్లిరోజు ఆ గౌను ధరించింది. అయితే పెళ్లి రోజు ఈదురు గాలులు అధికంగా ఉండడంతో ఆ గౌను మాటిమాటికి పైకి లేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఆమె డ్రెస్సును సర్దినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే వధువు గౌను డిజైన్ చేసిన రోయల్ అనే వ్యక్తి లాభం లేదని భావించి వధువు గౌనులోకి దూరతానని చెప్పాడు. ఈ విధంగా రోయల్ చెప్పడంతో అక్కడున్న వారు ఎంతో షాక్ అయ్యారు. ఈ విషయం విన్న వధువు కూడా ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయింది. అయితే బంధువుల ముందు గాలికి గౌను పైకి లేవడం కంటే తాను గౌను లోపల ఉండి గాలికి లేవకుండా జాగ్రత్త పడటం ఉత్తమమని భావించడంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఇందుకు ఒప్పుకున్నారు.
ఈ విధంగా వధువు తన తల్లిదండ్రులతో కలిసి వేదిక వద్దకు చేరుకున్న సమయంలో రోయల్ గౌను లోపల ఉండి అది గాలికి ఎగరకుండా, వధువు కాళ్లకు అడ్డురాకుండా సహాయపడుతున్నాడు.ఇక చివరికి వధువు వేదిక వద్దకు చేరుకోగానే తన చేతిని పట్టుకుని వేదిక పైకి తీసుకువెళ్తున్న సమయంలో రోయల్ గౌను నుంచి బయటకు రాగానే అక్కడున్న వారందరూ ఎంతో షాక్ అయ్యారు. ఈ విధంగా అతను గౌను నుంచి బయటకు రావడం కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ వీడియో కాస్త క్షణాలలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గాలికి గౌను పైకి లేవటం వల్లే తను ఈ విధంగా గౌనులోకి దూరి తనకు సహాయపడాలి అని తెలిపారు. అయితే వధువు లోపల మరొక డ్రెస్ వేసుకోవడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని రోయల్ చెప్పడంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…