ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు, స్టార్ సెలబ్రెటీలు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూవారి కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ వీరి సతీమణులు సోషల్ మీడియాలో యమ స్పీడ్ గా ఉంటారు.
మహేష్ బాబు భార్య నమ్రత ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తన కుటుంబానికి సంబంధించిన విషయాలను మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం అపోలో సంస్థలకు సంబంధించిన విషయాలను, పలు ఆరోగ్య విషయాలను, అదే విధంగా తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వీరిద్దరి కన్నా సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య ఎంతో యాక్టివ్ గా ఉంటారు. స్నేహ రెడ్డి అల్లు కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా,తన పిల్లలకు సంబంధించిన విషయాలను క్షణాలలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఓ రేర్ ఫీట్‌ను అందుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలోనే ఏ హీరో భార్యకు లేని ఫాలోయింగ్ స్నేహ రెడ్డికి ఉండటం విశేషం.తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నాలుగు మిలియన్లకు చేరుకుంది. ఈ విధంగా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న మొదటి వ్యక్తిగా స్నేహ రెడ్డి రికార్డును క్రియేట్ చేశారని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…