కొన్నిసార్లు మానవతా దృక్పథంతో ప్రమాదం నుంచి ఇతరులను కాపాడే ప్రయత్నంలో వారి ప్రాణాలను కోల్పోతుంటారు.ఈ విధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి గుజరాత్ లో చోటు చేసుకుంది. ఒక మేకను సింహం నుంచి కాపాడబోయి ఆ వ్యక్తి సింహానికి బలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ జిల్లాలోని తలాలా అటవీ రేంజ్ పరిధిలో మధుపూరు గ్రామంలో నివసించే బహదూర్‌భాయ్ జీవాభాయ్ (35)మామిడి తోటకు కాపలాగా ఉండేవాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి కూడా మామిడి తోట కాపలాకు వెళ్ళాడు. శనివారం తెల్లవారుజామున అడవి నుంచి ఒక సింహం బయటకు రావడంతో ఆ తోటలో ఉన్న మేక గట్టిగా అరవడం మొదలు పెట్టింది.
మేక అరుపులకు మేల్కొన్న జీవా బాయ్ సింహం నుంచి మేకను తప్పించాలనే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మేకను తప్పించబోయి జీవాభాయ్ సింహానికి దొరికాడు.సింహం జీవాభాయ్‌పై పంజా విసిరి చంపి తినింది. సింహం తనపై దాడి చేస్తున్నప్పుడు గట్టిగా జీవా బాయ్ అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
జీవా బాయ్ పై సింహం దాడి చేయటం చూసిన స్థానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సింహాన్ని బంధించి అడవిలోకి తీసుకెళ్లారు. అప్పటికే సింహం దాడిలో జీవా బాయ్ దారుణంగా చనిపోయాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…