మేకను సింహం నుంచి రక్షించే ప్రయత్నం.. చివరికి సింహమే?

0
66

కొన్నిసార్లు మానవతా దృక్పథంతో ప్రమాదం నుంచి ఇతరులను కాపాడే ప్రయత్నంలో వారి ప్రాణాలను కోల్పోతుంటారు.ఈ విధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి గుజరాత్ లో చోటు చేసుకుంది. ఒక మేకను సింహం నుంచి కాపాడబోయి ఆ వ్యక్తి సింహానికి బలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ జిల్లాలోని తలాలా అటవీ రేంజ్ పరిధిలో మధుపూరు గ్రామంలో నివసించే బహదూర్‌భాయ్‌ జీవాభాయ్‌ (35)మామిడి తోటకు కాపలాగా ఉండేవాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి కూడా మామిడి తోట కాపలాకు వెళ్ళాడు. శనివారం తెల్లవారుజామున అడవి నుంచి ఒక సింహం బయటకు రావడంతో ఆ తోటలో ఉన్న మేక గట్టిగా అరవడం మొదలు పెట్టింది.

మేక అరుపులకు మేల్కొన్న జీవా బాయ్ సింహం నుంచి మేకను తప్పించాలనే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మేకను తప్పించబోయి జీవాభాయ్‌ సింహానికి దొరికాడు.సింహం జీవాభాయ్‌పై పంజా విసిరి చంపి తినింది. సింహం తనపై దాడి చేస్తున్నప్పుడు గట్టిగా జీవా బాయ్ అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

జీవా బాయ్ పై సింహం దాడి చేయటం చూసిన స్థానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సింహాన్ని బంధించి అడవిలోకి తీసుకెళ్లారు. అప్పటికే సింహం దాడిలో జీవా బాయ్ దారుణంగా చనిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here