General News

స్నేహితుడి భార్యతో చనువు పెంచుకున్నాడని.. ప్లాన్ ప్రకారం హత్య..!

వాళ్లంతా చిన్ననాటి స్నేహితులు. ఎలాంటి కష్టం వచ్చినా చెప్పుకొని తీర్చుకునే వారు. కానీ అందులో ఒకడు తన భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన యదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆత్మకూరం మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి 2012లో అదే మండలం మోదుగగూడెం గ్రామానికి చెందిన శిరీషను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అశోక్‌రెడ్డికి బండ సురేష్‌, చిన్నం అర్జున, లగ్గాల రవి, నిషాంతరెడ్డి, రుషిసాయి బాల్యమిత్రులు. మొదటి నుంచి వీళ్లంతా కలిసి ఉండేవారు. చిన్ని చిన్న కారణాల వల్ల వాళ్ల స్నేహితుల్లో చిన్నం అర్జున(34), ఆయన భార్య మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే ఈ కేసులో వాయిదాలకు వెళ్లాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇలా వాయిదాలకు అశోక్‌రెడ్డి కారులోనే అతడు వెళ్లేవాడు. ఈ క్రమంలో తన భార్యతో అర్జున చనువుగా మాట్లాడడం చూసి అనుమానం పెంచుకున్న అశోక్‌రెడ్డి అతడితో మాట్లాడటం మానేశాడు.

అయినప్పటికీ అతనిలో మరింత అనుమానం పెరిగింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పగ పెంచుకున్నాడు. అర్జునను హత్య చేయాలని మరో స్నేహితుడు బండ సురేశ్ తో కలిసి ప్రణాళిక రూపొందించాడు. అర్జునను చంపేందుకు సా యం చేయాలని కోరగా మామ ఉడుత నర్సింహ, బావమరిది నవీన ఒప్పుకున్నారు. ఈ మేరకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ రాత్రి బండ సురేష్‌ అర్జున వద్దకు వెళ్లి మద్యం తాగుదాం రా అంటూ అశోక్‌రెడ్డి షెడ్‌కు తీసుకెళ్లాడు. వెంటనే అశోక్‌రెడ్డి, సురేష్‌, శిరీష, నర్సిం హ, నవీనతో పాటు మల్లేపూల శ్రీశైలం బైకులపై వస్తుండటంతో అతడికి అనుమానం వచ్చింది. అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సురేశ్ అతడిని అడ్డగించి పట్టుకున్నాడు.

వెంటనే అర్జునపై అశోక్ రెడ్డి, సురేష్ కూర్చొని విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. అతడు చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రామన్నపేట సీఐ మోతిరాం పర్యవేక్ష ణలో ఆత్మకూర్‌ ఎస్సై మధు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మకూర్‌ మండలంలోని తిమ్మాపురం చౌరస్తా వద్ద బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశోక్‌రెడ్డి, బండి సురేష్‌, శిరీష, నవీన, శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యచేసిన నిజాన్ని ఒప్పుకున్నారు. న్యాయమూర్తి ఆదేశం మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago