ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఎంతో అపురూపమైన వేడుక. ఈ వివాహ వేడుక ద్వారా ఇద్దరి జీవితాలు మూడుముళ్ల బంధంతో ఒకటవుతారు. ఈ విధంగా మూడుముళ్ల బంధం ద్వారా ఒకటైన ఈ జంట తాను జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని, ఎలాంటి కష్ట సుఖాలలో అయినా పాలుపంచుకుంటామని వరుడు అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి వధువు మెడలో తాళి కడతాడు. ఈ విధంగా వివాహం జరిగిన తర్వాత భార్య భర్తల జీవితం ఎంతో అన్యోన్యంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవాలి.
ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఓ జంట విషయంలో మాత్రం ఇలా జరగలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త ఒక ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా తాను మూడు ముళ్లు వేసిన భార్యని గుర్తు పట్టలేకపోయాడు. అసలు తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని కూడా మరిచిపోయాడు. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. తనకి పెళ్ళి జరిగిందనే విషయం మర్చిపోయిన ఆ వ్యక్తి తిరిగి తన భార్యకే లవ్ ప్రపోస్ చేయడం గమనార్హం.
మతిమరుపు వ్యాధితో బాధ పడుతున్న ఆ వ్యక్తి తన జ్ఞాపక శక్తిని కోల్పోయిన తన భార్య పై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తన భార్యను గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నప్పటికీ తిరిగి తనని నన్ను పెళ్లి చేసుకుంటావా ?అని అడగడంతో అందుకు ఆ మహిళ ఎస్ అని చెప్పిన ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లో చోటుచేసుకుంది. 56 ఏళ్ల పీటర్ మార్షల్ పన్నెండేళ్ల కిందట లీసాను పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన కొన్నేళ్లలోనే అతడు మతిమరుపు వ్యాధితో బాధపడ్డాడు.
ఈ క్రమంలోనే లీసా తన భర్తకు గతం గుర్తు చేయడానికి తనకు పెళ్లి జరిగిన సమయంలో తీసిన వీడియోను చూపించింది. అయినప్పటికీ తనకి గతం ఏ మాత్రం గుర్తుకు రాకపోగా మనం ఈటీవీలో మాదిరిగానే పెళ్లి చేసుకుందామా అని అడగగా అందుకు పీటర్ ఒప్పుకొన్నారు. ఈ విధంగా తన జీవితంలో రెండో సారి తన భర్తతోనే వివాహం చేసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని, వీరి పెళ్లిని తన కూతురి దగ్గరుండి ఎంతో ఘనంగా జరిపించింది. ఈ విధంగా పీటర్ పెళ్లికి ఒప్పుకోవడంతో అతడు జ్ఞాపకశక్తిని కోల్పోయినా తన మీద ప్రేమ తగ్గలేదని, ఇప్పటికే అతడికి తానంటేనే ఇష్టమని ఆమె మురిసిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…