Manchu Lakshmi interesting comments : మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మంచు లక్ష్మి. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అనగనగా ఒకదీరుడు సినిమా తో సినీ రంగ ప్రవేశం చేసింది. నటించి మొదటి చిత్రనికి ఉత్తమ విలన్ గా నంది పురస్కారం అందుకుంది. తెలుగులో సినిమా చేయకముందు మంచు లక్ష్మి అమెరికాలో ఆంగ్ల సీరియల్స్ లో కూడా నటించిందట. అంతేకాదు తెలుగులో సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ, అలాగే టీవీ షో ల ను కూడా చేసింది. అయితే ప్రస్తుతం మంచులక్ష్మి సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు.
కానీ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురితో వీడియోలని,హోమ్ టూర్ లని ఇలా ఏదో ఒక అంశంతో అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి నిర్మాతగా మాత్రమే తన కెరీర్ని సాగిస్తోంది. అయితే తాజాగా మంచు లక్ష్మి నిర్మాతల కష్టాలు అంటూ ఒక ట్వీట్ చేసింది. అయితే ఏం జరిగింది ఎందుకు ట్వీట్ చేసింది అన్న విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది.
నిర్మాతల కంటే, యాక్టర్స్ బతుకే సో బెటర్…..
ప్రస్తుతం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి వారి గురించి ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుత కాలంలో నిర్మాతల పాత్ర ఎలా ఉంది ఇంతకు ముందు ఎలా ఉండేది అని చెబుతూ ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ మంచు లక్ష్మి ఎందుకు చేసింది అన్నది అందరికి ప్రశ్న గా వుంది. మంచు లక్ష్మి నిర్మాతల కష్టం ఎలా ఉంటుందో చెప్పుకొస్తూ ఇలా ట్వీట్ చేసింది….ఇప్పుడు సినిమాలలో నిర్మాతలను కేవలం ఫైనాన్షియర్లుగానే చూస్తున్నారు. సినిమా నిర్మాణంలో వారి పాత్ర కనిపించడంలేదు . ఓ సినిమాను నిర్మించాలంటే .. అందరినీ మ్యానేజ్ చేయాలి..సమర్థవంతంగా ఉండాలి,ఎంతో నైపుణ్యం ఉండాలి.. నిర్లక్ష్యం, ఈగోలు, యాటిట్యూడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి.. అప్పటి నుంచి ఒక్క షాట్ కోసం ఎదురుచూస్తున్నా. నిర్మాతల కష్టాలు.. యాక్టర్స్ బతుకే సో బెటర్” అంటూ ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ కు నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది అసలు ఏమైంది, ఎందుకు ట్వీట్ చేసావ్, నీ బాధ ఏంటి, నువ్వు ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళవా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మంచు లక్ష్మి దేన్ని ఉద్దేశించి, ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…