Movie News

Manchu Manoj: డబ్బులు తీసుకొని వారికి ఓటు వేయద్దు.. వారికి మాత్రమే వేయండి: మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి మంచు మనోజ్ తాజాగా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటు ఎవరికి వేయాలనే విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి మీరు ఓటు వేసే నాయకుడు అందరితో కలిసి ముందుకు వెళుతున్నాడా? దారుణాలకు పాల్పడుతున్నారా అనే విషయాలను గుర్తు పెట్టుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

మనం ఎన్నుకొని నాయకుడు ఎప్పుడు కూడా మనకు అండగా నిలబడాలి పేదలకు సహాయం చేయాలి అందరితో పాటు కలిసి ముందుకు వెళ్లాలి ఇలాంటి వారికే ఓటు వేయాలి. అయితే డబ్బులు ఇచ్చారని దారుణాలకు పాల్పడుతున్నటువంటి వారికి మాత్రం ఓటు వేయద్దు. ఎవరైతే రాష్ట్రాన్ని సురక్షితంగా పరిపాలిస్తారో అలాంటి వారికే ఓటు వేయాలంటూ ఈయన పిలుపు ఇచ్చారు.

అందరితో కలసి ముందుకు వెళ్తున్నారా..
ఈ విధంగా మనోజ్ ఓటు హక్కు వినియోగించుకోవడం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అనే విషయాలు మాత్రం తెలియడం లేదు తన తండ్రి గతంలో వైసిపి పార్టీకి మద్దతు తెలిపారు .కానీ ఇప్పుడు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడుని కలవడంతో ఈయన టిడిపికే మద్దతు తెలుపుతున్నారంటూ కూడా పలువురు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago