Manchu Manoj: మంచు మనోజ్ తాజాగా భూమ మౌనికను రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత ఈ జంట మొదటిసారి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను సందర్శించారు.ఇలా విద్యానికేతన్ సంస్థలకు వెళ్ళినటువంటి ఈ దంపతులకు విద్యార్థుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఇక మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా అక్కడ విద్యార్థులతో మంచు మనోజ్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.జీవితంలో ప్రతి ఒక్కరికి గెలుపు ఓటములు రావడం సర్వసాధారణం అయితే మన ప్రయాణంలో మనం ప్రతిదానిని అనుభూతి చెందాలని తెలిపారు.ఇక తన జీవితంలో కూడా ఇలాంటి ఓ గడ్డు పరిస్థితి వచ్చింది ఇలా జీవితం మొత్తం చీకటి కమ్ముకున్నప్పుడు నాకు ఓ వెలుతురు కనిపించింది.
ఆ వెలుతురు పేరే మౌనిక.
ఇక తనకు సినిమాలు చేయడం సామాజిక సేవ చేయడం అంటే ఎంతో ఇష్టం గత ఆరు సంవత్సరాలుగా నేను సినిమాలు చేయకపోయినా నాపై అభిమానులు అంతే ప్రేమ చూపిస్తున్నారు. ఇది ఏ జన్మ ఫలితము అంటూ ఈయన మాట్లాడారు. ఇక తాను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి తను కోరుకున్న కలలకు తాను చేరుకోవాలని ఈయన ఆకాంక్షించారు.
ఇక ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. అలాగే ప్రతి ఆడవారి విషయం వెనుక మగాడు ఉండాలని మౌనిక విషయంలో తన సపోర్ట్ తనకి ఎప్పుడూ ఉంటుంది అంటూ ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మనోజ్ మౌనిక గురించి ఇలా మాట్లాడటంతో అక్కడే ఉన్నటువంటి మౌనిక కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…