Manchu Manoj: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మనోజ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు అయితే ఈయన కొన్ని వ్యక్తిగత విషయాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు అంతేకాకుండా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. అప్పటినుంచి భూమా మౌనికతో ప్రేమలో ఉన్నటువంటి మనోజ్ గత ఏడాది మార్చి నెలలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో రెండో వివాహం చేసుకొని తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే గత ఏడాది డిసెంబర్లో మౌనిక తల్లి కాబోతుందని తాను తండ్రి కాబోతున్నానంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.
ఇలా త్వరలోనే మనోజ్ తండ్రి కాబోతున్నారు అనే ఈ వార్త అభిమానులకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇదిలా ఉండగా తాజాగా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో తన భర్తతో కలిసి ఈమె ఫోటోషూట్ చేయించారు ఈ ఫోటోలను మౌనిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మనోజ్ అలాగే తన కుమారుడిని టాగ్ చేశారు.
మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది…
ఇక ఈ ఫోటోలపై మంచు మనోజ్ స్పందిస్తూ పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేసాడు. దీంతో భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మనోజ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఉస్తాద్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…