Featured

Manchu Vishnu : మరో సంచలన కామెంట్ చేసిన మంచు విష్ణు.. ఈసారి మెగాస్టార్ తో పాటు మహేష్ బాబుని కూడా టార్గెట్ చేశారా..?

Manchu Vishnu : మెగా ఫ్యామిలీ కి మంచూ ఫ్యామిలీ కి మధ్య వివాదాలు పెరగడం తప్పితే తగ్గేలా లేదు. ఇద్దరిలో ఎవరికి అవకాశం వచ్చినా ఎవరు వదులుకోవడం లేదు, అవతలి వారి మీద కౌంటర్ లు వేస్తూనే వున్నారు. మా ఎలక్షన్ల అప్పటినుండి వీరిద్దరి మధ్య వివాదాలు బాగా రాజుకున్నాయ్. అయితే తాజాగా విడుదల అయిన మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియా మీద నాగబాబు వేసిన సెటైర్ లు వీటిని పెంచాయ్ అనే చెప్పుకోవాలి. ఇక రీసెంట్‌గా మంచు విష్ణు, దాసరి జయంతి సందర్భంగా.. ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ రావును ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ ఇండస్ట్రీ పెద్ద అంటే అప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణ రావు గారే ఉంటారు అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను మంచు విష్ణు ఎవరిని ఉద్దేశించి చేసాడనేది బహిరంగం రహస్యం.

చిరంజీవి పై ఇండైరెక్ట్ కౌంటర్ కోసం మహేష్ ను లాగాడా….

ఇక మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు కార్యక్రమాలు చేపడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ‘మా’ సభ్యుల కోసం ఏఐజీ హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈక్రమంలోనే సినిమా టికెట్ ధరల విషయమై మాట్లాడుతూ… టికెట్ రేట్లు విషయంలో పెంచితే కొంతమందికి .. తగ్గిస్తే మరి కొంతమందికి ఇబ్బందులు వస్తాయన్నారు. అందుకే మా అధ్యక్షుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉన్నాను అని చెప్పారు .

టికెట్ల ధర అంశం అనేది చాలా పెద్ద సమస్య . దీనిపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ ఇద్దరు కలిసి చర్చించి ఒక మాట మీదకు రావాలన్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలను పక్కన పెడితే.. రీసెంట్‌గా చిరంజీవి ఆచార్యతో సినిమాతో పాటు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలకు ఒక వారం పాటు టిక్కెట్ ధరలు పెంచుకునేందకు ప్రభుత్వం స్పెషల్ గా అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవిపై ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్‌ వేయడం కోసం మహేష్ బాబును మధ్యలో లాగడం ఇపుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్‌గా మారింది.

Bhargavi

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

5 minutes ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

3 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

3 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

4 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

6 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

6 hours ago