Manchu Vishnu : ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు సినిమా ద్వారా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు ఆ తర్వాత అస్త్రం, ఢీ, కృష్ణార్జున, దేనికైనా రెడీ వంటి సినిమాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే మంచు విష్ణు నటించిన సినిమాలు చెప్పుకోతగ్గ స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి.
ఇటీవల కొంతకాలము సినిమాలకు దూరంగా ఉన్న మంచు విష్ణు మా ఎన్నికల సమయంలో చాలా సందడి చేసి మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. మంచు విష్ణు సినిమాలు తక్కువగా చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో మంచు విష్ణు చేసే పోస్ట్ లు.. ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతాయి.
తాజాగా మంచు విష్ణు సోషల్ మీడియాలో తన ఫొటో షేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు వెంటనే స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మంచు విష్ణు షేర్ చేసిన ఫోటోలో..ఆయన అలా దీనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది. ఈ ఫోటో షేర్ చేస్తూ.. నేనేమీ చెయ్యాలే.. అని ట్యాగ్ చేస్తూ థర్స్ డే థాట్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన వెంటనే నెటిజన్లు తమ కామెంట్లతో అతని మీద దాడికి దిగారు.
ఫాదర్ ఆఫ్ ఇండియా అనే సినిమా తీసేయ్ అంటూ కొందరు కామెంట్స్ చేయగా..నువ్ ఏదో చేసేయాలని ఇంకేదో చేసేయకు భయ్యో… ఫస్ట్ నువ్ తీసే సినిమా మీద ఫోకస్ పెట్టు అని ఇంకొందరుకామెంట్స్ చేస్తున్నారు. టైమ్‌కి చేతిలో రాయి లేదు కాబట్టి బతికిపోయావ్..! అంటూ మరికొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మంచు విష్ణు షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకి జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ మంచు విష్ణు సరసన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…