Madhavi Latha : రవిబాబు ‘నచ్చావులే’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి మాధవి లత. ఆ తరువాత నాని తో నటించిన ‘స్నేహితుడా’ సినిమా కూడా మంచి పేరే తెచ్చింది. కానీ తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల పెద్దగా ఏ డైరెక్టర్లు మాధవి లతను పట్టించుకోలేదు. ఇక ఈమె రాజకీయాల్లోను బీజేపీ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది.
వరుడు సినిమాలో ఐటమ్ సాంగ్ కి అడిగారు…
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన డిజాస్టర్ సినిమా వరుడు. ఈ సినిమాలో మొదట గుణశేఖర్ ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలని అనుకున్నారట. అందుకోసం తెలుగు అమ్మాయిలు అయితే బాగుంటుందని మాధవి లత, బిందు మాధవిలను తీసుకోవాలని అనుకున్నారట. మాధవి లతను అడుగగా స్నేహితుడా సినిమా పాట షూటింగ్ రాజమండ్రిలో ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పిందట. అలా ఆ అవకాశం పోయిందట. నచ్చావులే సినిమా తరువాత చాలా మంది దర్శకులు ఐటమ్ సాంగ్ చేయమని అడిగారట.
రోజుకు లక్ష రూపాయల చొప్పున మూడు రోజులు లేక ఐదు రోజుల షూటింగ్ కి మూడు నుండి ఐదు లక్షలు పారితోషకం ఆఫర్ చేసిన ఐటమ్ సాంగ్ అని ఆలోచించి వద్దనుకుందట మాధవి లత. 2018 వరకు అలాంటి ఆఫర్స్ వచ్చేవని చెప్పింది. ఇక విలన్ పాత్రలో నటించాలని ఉందని చెప్పింది. ఈ మధ్య కాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో నటిస్తున్న పాత్రలు నచ్చుతాయని అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…