Featured

Manchu Vishnu: నాన్నగారి “కలెక్షన్ కింగ్” బిరుదుకు నేను అర్హుడిని కాదు.. : మంచు విష్ణు

Manchu Vishnu: సినిమా ఇండస్ట్రీలో వారసులు కొనసాగడం అనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సీనియర్ హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా మంచు మోహన్ బాబు కుమారులుగా ఇండస్ట్రీలో విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మంచు విష్ణు జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.మంచు విష్ణు సినీ కెరియర్ లో పలు సినిమాలు సూపర్ హిట్ చిత్రంగా నిలిచాయి అయితే ఈ మధ్యకాలంలో ఈయన చేసిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విష్ణు ఈ విషయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ తాము మోహన్ బాబు పిల్లల మని చాలామంది మమ్మల్ని ఆయనతో పోలుస్తుంటారు. నిజానికి ఆయన చిత్ర పరిశ్రమలో చూసిన్నన్ని ఎత్తు పల్లాలను మేము చూడలేదు. నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను అందుకున్నారు. అయితే నాన్న నటించిన పాత్రలలో నేను కొన్ని కూడా నటించలేను.

Manchu Vishnu: అందుకు నేను అర్హుడిని కాదు..


నాన్నగారిలా పలు విభిన్న పాత్రలలో నటించాలని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇక నాన్నగారికి కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఉంది. నాన్నగారు కలెక్షన్ కింగ్ అని అలాంటి బిరుదు అందుకోవడానికి నేను ఇంకా అర్హుడిని కాదు. భవిష్యత్తులో అయినా అలాంటి బిరుదు నాకు దక్కుతుందేమోనని ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తండ్రి మోహన్ బాబు గురించి విష్ణు ఎంతో గొప్పగా చెబుతూ తాను కూడా తన తండ్రి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago