Actress Hema: సినీనటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఈమె డ్రగ్స్ కూడా తీసుకున్నారనే విషయాన్ని పోలీసులు తెలియజేయడంతో ప్రస్తుతం పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. దాదాపు 100 మంది పాల్గొన్నటువంటి ఈ పార్టీలో 86 మంది వరకు డ్రగ్ తీసుకున్నారని పోలీసుల వెల్లడించారు. అయితే హేమకు కూడా పాజిటివ్ రావడంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారు.
నోటీసులు పంపినప్పటికీ హేమా విచారణకు హాజరు కాకపోవడంతో ఏకంగా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే కోర్టు పది రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈమె రిమాండ్ లో ఉండబోతున్నారు.
ఇలా రేవ్ పార్టీలో పాల్గొనీ డ్రగ్స్ తీసుకోవడంతో ఈమెపై మా కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఈమె పై సస్పెన్షన్ వేటు వేయాలని మా అసోసియేషన్ ఆలోచించినప్పటికీ ఈమె విషయంలో ఎలాంటి నిర్ధారణ రాకపోవడంతో మంచు విష్ణు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సస్పెన్షన్ వేటు..
ఈ క్రమంలోనే హేమ విషయంపై ఆయన మా అసోసియేషన్ సభ్యులతో మాట్లాడగా ఎక్కువ మంది ఆమెను సస్పెన్షన్ చేయాలని చెప్పడంతో మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఆమెపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా ఆమెకు క్లీన్ చిట్ వచ్చేవరకు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…