Movie News

మణిశర్మ కి కూడా కొత్త ట్యూన్ లు దొరకడం లేదా..!!!

మణిశర్మ.. టాలీవుడ్ ని ఒకప్పుడు తన సంగీతంతో ఉర్రుతలూగించిన సంగీత దర్శకుడు.. ప్రస్తుతం సినిమాలు ఏవీ లేకపోయినా కం బ్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడు. రెకమండేషన్ల మీద సినిమాలు తెచ్చుకుంటున్నాడు.. ఇప్పటికే ఆచార్య సినిమా మణిశర్మ చేతిలోకి వచ్చింది. దాంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా మణిశర్మ చేతిలోనే ఉన్నాయి.. తాజగా గోపీచంద్ హీరో గా వస్తున్న సిటీమార్ సినిమా కి కూడా సంగీతం అందిస్తున్నారు మణిశర్మ..

ఈ సినిమా నుంచి ఓ పాట ఈరోజు రిలీజ్ అయ్యింది. జ్వాలా జ్వాలా రెడ్డి అంటూ వచ్చిన ఈ పాట జానపదం గా ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. అయితే ఈ పాటలోని ఓ బీట్, ఇచ్చిన ట్యూన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జ్వాలా రెడ్డి అంటూ వదిలిన మాస్ బీట్ సాంగ్‌పై యూట్యూబ్‌లో కామెంట్ల రూపంలో చర్చలు జరుగుతున్నాయి.

సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కబడ్డీ అట నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమా నుంచి జ్వాలారెడ్డి అనే పాట రిలీజ్ అయ్యింది. మంచి మాస్ బీట్‌లో సాగుతున్న ఈ పాట ట్యూన్ మాత్రం తెలంగాణ ప్రజలకు సుపరిచితమే.గొల్లమల్లమ్మ, కళ్లజోడు కాలేజ్ పాప అనే పాటలు తెలంగాణలో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట ట్యూన్స్‌ను వాడేసి జ్వాలా రెడ్డి అనే పాటను క్రియేట్ చేశాడు మణిశర్మ. దీంతో యూట్యూబ్‌లో నెటిజన్లు మణిశర్మను ఏకిపారేస్తున్నారు.దీన్ని కూడా కాపీ చేసేశారా? అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాపీ ట్యూన్ అంటూ ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు.

 

 

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago