Featured

Marudhuri Raja : హిట్లర్ సినిమా వెనుక పెద్ద కుట్ర జరిగింది… మొదట మోహన్ బాబుని అనుకుని చిరంజీవిని పెట్టడానికి కారణం…: రచయిత మరుధూరి రాజా

Marudhuri Raja : తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మరుధూరి రాజా స్వస్థలం గుంటూరు. మొదటి సినిమా ఒంటరి పోరాటం నుండి రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఎక్కువ సినిమాలు చేసిన రాజా తన అనుభవాలు, దర్శకుడిగా చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైంది, నటుడుగా ఎందుకు రాలేదనే విషయాల గురించి స్పందించారు. ఇక హిట్లర్ సినిమాకు రైటర్ గా పనిచేయాల్సిన తాను ఎలా ఆ అవకాశం కోల్పోయింది తెలిపారు.

హిట్లర్ లో మొదట మోహన్ బాబును అనుకుని…

ఎడిటర్ మోహన్ గారికి మరుధూరి రాజా గారికి మంచి సంబంధాలు మొదటి నుండి ఉండేవి. అలా ఉన్న స్నేహంతోనే ఎడిటర్ మోహన్ మలయాళంలో విడుదల కాబోతున్న మమ్ముట్టి సినిమా హిట్లర్ గురించి రాజా కు చెప్పి మోహన్ బాబు తో తీయడానికి ఈవివి సత్యనారాయణ ను ఒప్పించండి అని పంపారట. అయితే ఈవివి అప్పటికే రెండు సినిమాలు మోహన్ బాబు తో తీసాను మళ్ళీ వద్దు అని చెప్పేసాడట.

దీనితో ఆ ప్రాజెక్ట్ వదిలేసినా మళ్ళీ కొద్దిరోజులకు ఫోన్ చేసి చిరంజీవి గారు ఓకే చేసారు హిట్లర్ కథను అని ఎడిటర్ మోహన్ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారట మరుధూరి రాజా. ఇక చిరంజీవి కి రైటర్ గా పనిచేసే అవకాశం వచ్చిందనుకుంటే అంతలోనే వేరే వాళ్ళను రైటర్ గా నియమించుకున్నారు అంటూ అప్పట్లో జరిగిన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు మరుధూరి రాజా.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

3 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

3 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

3 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

3 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

3 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

3 hours ago