మన భారతదేశంలో పుట్టిన పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తోంది. ఈ వ్యాక్సిన్ లలో భాగంగా పిల్లలకు మీజిల్ వ్యాక్సిన్ వేస్తారు. దీనిద్వారా వారికి తట్టు ఆటలమ్మ అనే అంటువ్యాధులు సోకకుండా, ఒకవేళ సోకిన వాటి నుంచి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పిల్లలకు ఈ వ్యాక్సినేషన్ అందిస్తారు. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ పిల్లలలో కరోనాను నివారించే లక్షణాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పుణెలోని బీజే వైద్యకళాశాల నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా 548 మంది పిల్లలలో కోవిడ్ సోకిన వారిని ఒక బృందం, కోవిడ్ సోకని వారిని మరొక బృందంగా విడదీశారు. వీరిపై జరిపిన పరిశోధనలో భాగంగా మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కోవిడ్ 87 శాతం సమర్థంగా అడ్డుకున్నట్టు తెలిపారు.
పిల్లలలో మీజిల్స్ వ్యాక్సిన్ కారణంగా పిల్లలలో కోవిడ్ లక్షణాలు పెద్దగా కనిపించలేదని ఈసందర్భంగా పరిశోధకులు తెలియజేశారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తో పాటు ప్రభావశీలత తగ్గించిన వైరస్లతో రూపొందించిన టీకాలను తీసుకోవడం, అలాగే బీసీజీ వాక్సిన్లు వేయించుకోవడం వల్ల పిల్లలు రక్షణ పొందగలుగుతున్నారని పూణే వైద్య కళాశాల నిపుణులు తెలియజేశారు.
ప్రస్తుతం థర్డ్ దేవ్ ముంచుకొస్తోందన్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఫలితాలు రావడం కొంతవరకు ఆనందాన్ని కలిగించినప్పటికి, ఈ పరిశోధనలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని పిల్లల వైద్య నిపుణులు తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…