మీజిల్ వ్యాక్సిన్ తో పిల్లలకు కరోనా నుంచి రక్షణ.. నిపుణులు ఏమంటున్నారంటే?

0
429

మన భారతదేశంలో పుట్టిన పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తోంది. ఈ వ్యాక్సిన్ లలో భాగంగా పిల్లలకు మీజిల్ వ్యాక్సిన్ వేస్తారు. దీనిద్వారా వారికి తట్టు ఆటలమ్మ అనే అంటువ్యాధులు సోకకుండా, ఒకవేళ సోకిన వాటి నుంచి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పిల్లలకు ఈ వ్యాక్సినేషన్ అందిస్తారు. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ పిల్లలలో కరోనాను నివారించే లక్షణాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పుణెలోని బీజే వైద్యక‌ళాశాల నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా 548 మంది పిల్లలలో కోవిడ్ సోకిన వారిని ఒక బృందం, కోవిడ్ సోకని వారిని మరొక బృందంగా విడదీశారు. వీరిపై జరిపిన పరిశోధనలో భాగంగా మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కోవిడ్ 87 శాతం స‌మ‌ర్థంగా అడ్డుకున్నట్టు తెలిపారు.

పిల్లలలో మీజిల్స్ వ్యాక్సిన్ కారణంగా పిల్లలలో కోవిడ్ లక్షణాలు పెద్దగా కనిపించలేదని ఈసందర్భంగా పరిశోధకులు తెలియజేశారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తో పాటు ప్రభావ‌శీల‌త త‌గ్గించిన వైర‌స్‌ల‌తో రూపొందించిన టీకాల‌ను తీసుకోవ‌డం, అలాగే బీసీజీ వాక్సిన్లు వేయించుకోవ‌డం వ‌ల‌్ల పిల్లలు రక్షణ పొందగలుగుతున్నారని పూణే వైద్య కళాశాల నిపుణులు తెలియజేశారు.

ప్రస్తుతం థర్డ్ దేవ్ ముంచుకొస్తోందన్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఫలితాలు రావడం కొంతవరకు ఆనందాన్ని కలిగించినప్పటికి, ఈ పరిశోధనలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని పిల్లల వైద్య నిపుణులు తెలియజేశారు.