Featured

Medico Preethi Death : నాలుగు నెలలు ప్రీతి నరకం చూసింది… ప్రీతి మృతికి సైఫ్ ఒక్కడే కారణం కాదు… బయటపడ్డ సంచలన నిజాలు…!

Medico Preethi Death : కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి గత బుధవారం డ్యూటీలో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యా యత్నం చేయగా గురువారం నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు ఓడిపోయింది. ఆమెది ఆత్మహత్య కాదు కాలేజీలో ఏదో జరిగింది అంటూ ప్రీతి కుటుంబం ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం ర్యాంగింగ్ కు బలైంది.

నాలుగు నెలలుగా టార్చర్…

ప్రీతి గత నవంబర్ లో కాకతీయ యూనివర్సిటీ లో పీజీ కోర్స్ చేరింది. అయితే చేరినప్పటి నుండి ఆమెను సీనియర్ విద్యార్థి సైఫ్ వేదించడం మొదలు పెట్టారు. జాయిన్ అయిన వెంటనే టీమ్స్ గా జూనియర్ స్టూడెంట్స్ తో సీనియర్స్ ను కలిపి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో హాస్పిటల్ విధులను అప్పగిస్తారు. అయితే ప్రీతిని సీనియర్ అయిన సైఫ్ కింద పనిచేయడానికి వేయగా వారికి హెడ్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోవడం వల్ల సైఫ్ టీం మొత్తాన్ని చూసుకోవాల్సి వచ్చింది. దాంతో మొదటి నుండి ప్రీతిని టార్గెట్ చేసి తిట్టడం, ఆపరేషన్ థియేటర్ లోనే అందరి ముందు తిట్టడం, డ్యూటీ అయ్యాక రాసే రిపోర్ట్స్ సరిగా రాయడం లేదంటూ హేళన చేయడం, వాట్సాప్ గ్రూప్ లో అందరికీ తెలిసేలా హేళనగా మాట్లాడటం వంటివి చేసాడు సైఫ్.

ఈ ఇష్యూని హెచ్ఓడి నాగార్జున రెడ్డి దృష్టికి అలాగే ప్రిన్సిపాల్ దృష్టికి కూడా ప్రీతి తీసుకెళ్ళింది. నిజానికి సైఫ్ ఒక్కడి వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదు. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును సరిగా పట్టించుకోని హెచ్ఓడి అలానే ప్రిన్సిపాల్ అలాగే సీనియర్స్ అందరూ కారణం అయ్యారు. సైఫ్ కు మద్దతుగా సీనియర్స్ అందరూ ప్రీతిని దూరం పెట్టడం అలాగే ప్రొఫెసర్స్ ఇష్యూని పట్టించుకోకపోవడం, హెచ్ఓడి నాగార్జున రెడ్డి పోలీస్ కంప్లైన్ట్ ఇచ్చినందుకు ప్రీతిని మందలించడంతో సమస్య అలాగే టార్చర్ ఇంకా పెద్దది గా మరిందని భావించిన ప్రీతి తనలో తానే మానసికంగా క్రుంగిపోయి చివరకు బలవన్మరణానికి పాల్పడింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago