Kiara Advani: బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి కియారా అద్వాని ఒకరు.ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఫిబ్రవరి 7వ తేదీ తన ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రతో పెళ్లి పీటలు ఎక్కిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంతో అంగరంగ వైభవంగా వీరిద్దరూ అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకటయ్యారు.ఇలా వీరి వివాహం జరిగిన అనంతరం నటి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కియారా జీ సినీ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ఈ అవార్డు కార్యక్రమంలో భాగంగా ఈమె అందాలను ఆరబోస్తూ రచ్చ చేశారు. ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఎద అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఇలా పెళ్లి తర్వాత కూడా నటి కీయారా గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఈ విధంగా పెళ్లి తర్వాత కూడా శృతి మించిన అందాల జాతర చేయడంతో పలువురు నెటిజన్లు ఈ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు. అయితే పెళ్లికి సినిమాలకు ఏమాత్రం సంబంధం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా పెళ్లి తర్వాత ఈమె ఇలాంటి గ్లామర్ షో చేస్తూ ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…