RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా గత ఏడాది విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకుంది. ఇక ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.ఇలా ఇప్పటికే ఈ సినిమా ఫిలిం ఫేర్ హాలీవుడ్ క్రిటిక్స్ గోల్డెన్ గ్లోబ్ వంటి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.
ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో పురస్కారాలను అందుకున్నప్పటికీ ఈ అవార్డుల జాతరలో మాత్రం చిత్ర బృందం పాల్గొన్న ఈ సినిమా నిర్మాత దానయ్య మాత్రం కనిపించలేదు. ఈ క్రమంలోనే నిర్మాత ఎక్కడా కనిపించకపోవడంతో ఎంతోమంది పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ఈ సందర్భంగా కొందరు ఈ సినిమా అవార్డుల జాతరలో దానయ్య కనిపించకపోవడానికి గల కారణం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండడం కోసం సినిమా ప్రమోషన్లకు అయ్యే ఖర్చును నిర్మాత దానయ్య భరించలేనని చెప్పారట.ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని అయితే ఇదంతా కూడా రాజమౌళి మాత్రమే భరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్లకు దానయ్య డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఆయన ఈ సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.అయితే మరొక వార్త కూడా వైరల్ గా మారింది. దానయ్య వేదికలపై మాట్లాడటానికి కాస్త తడబడతారు. అందుకోసమే ఆయనను ఇతర దేశాలకు తీసుకువెళ్లి అక్కడ వేదిక ఇబ్బంది పెట్టడం ఎందుకు అని భావించిన రాజమౌళి ఈ సినిమా బాధ్యతను ఇప్పటికే తన భుజాలపైనే వేసుకొని అవార్డు వేడుకలలో కూడా దానయ్యకు వచ్చిన అవార్డులను అందుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా అవార్డు వేడుకలోనైనా దానయ్య పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…