Categories: FeaturedGeneral News

Medico Preethi incident : ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం… ప్రీతి విషయంలో అసలేం జరిగింది…!

Medico Preethi incident : కాకతీయ యూనివర్సిటీలో మెడిసిన్ చదివుతున్న ప్రీతి అనే యువతి బుధవారం డ్యూటీ లో ఉండగానే హాని కలిగించే ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ చదువుతున్నా ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యా యత్నం చేయగా గురువారం నాడు మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం క్రిటికల్ గా ఉండటంతో అసలు ప్రీతి ఆత్మహత్యా యత్నం ఎందుకు చేసుకోవాలనుకుంది అనేది తెలుసు కొవడానికి పోలీసులు ప్రయత్నస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

భాష, రాత గురించి వాట్సాప్ లో కామెంట్స్…

సీనియర్ విద్యార్థుల నుండి ర్యాగింగ్ అనేది ఎప్పటి నుండో వినిపిస్తున్నదే అందులోనూ మెడికల్ కాలేజీలలో ఈ ర్యాగింగ్ మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ జాడ్యం ఇంకా కాలేజీలలో ఉంది. ఇప్పుడు వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని బలి చేసింది. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ అనే విద్యార్థి ప్రీతి రాసిన రిపోర్ట్స్ ను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఆమె భాష అలాగే రాసిన విధానాన్నీ అందరితోనూ పంచుకుని ఆమెను హేళన చేయడం వంటివి చేసాడనేది పోలీసులు చెబుతున్నా అంతకంటే ఎక్కువగా వేదించడని ప్రీతి తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రీతి ఎంజీఎం ఎమర్జెన్సీ ఓటీలో ఉండగా అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రీతి తండ్రి రైల్వే లో పోలీసు అధికారిగా పనిచేస్తున్నారు. తన కూతురు విషయంలో న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నారు. సైఫ్ టార్గెట్ చేసి వేధిస్తున్నడనే విషయం ప్రీతి చెప్పడంతో గతంలో పోలీసులకు అలాగే కాలేజీ హెచ్ఓడి దృష్టికి తీసుకెళ్లినా సైఫ్ మాత్రం జూనియర్స్ నేర్చుకోవడం కోసం ఒక్కోసారి గట్టిగా చెప్పాల్సి వస్తుంది అంటూ చెప్పాడు. కానీ వేధింపులు ఆపలేదు, ప్రీతికి తోటి విద్యార్థులు సహకరించరాదని కూడా సైఫ్ మిగిలిన వారికి చెప్పడం వంటివి చేసాడని పోలీసుల దర్యాప్తులో తేలాయి.

ఇదిలా ఉండగా ఆమె పనిచేసిన వార్డుల్లో కానీ హాస్టల్ వాచ్ మెన్స్ కానీ ప్రీతి చాలా మంచి అమ్మాయి అంటూ అయితే ఏం జరిగిందో మాకసలు తెలియదంటూ చెబుతున్నారు. ఇక ప్రీతి తండ్రి మాత్రం వరంగల్ లో తనకు చికిత్స బాగానే ఇస్తున్నా కావాలనే హైదరాబాద్ నిమ్స్ కు షిఫ్ట్ చేసారని, తన కండిషన్ కూడా సరిగా చెప్పడం లేదని సైఫ్ ను కాపాడాలని కాలేజీ యాజమాన్యంలో కొంత మంది చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రీతి కండిషన్ క్రిటికల్ గా ఉంది, తన శరీరంలో మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. తను వేసుకున్న ఇంజక్షన్ ఏంటో తెలిస్తే చికిత్స అందించవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రీతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండగా వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago