Categories: FeaturedGeneral News

వామ్మో.. ఈ ఫోటో ఖరీదు 3.3 కోట్ల రూపాయిలు.. ఎందుకంటే?

ప్రస్తుత కాలంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో మారుమూల ప్రాంతాలలో జరిగే సంఘటనలు కూడా అందరికీ తెలుస్తున్నాయి. ఈ విధమైనటువంటి వింతలు వినోదాలు ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తం చూసేలా చేస్తున్నాయి. ఈ విధమైనటువంటి వీడియోలు ఫోటోలు కొందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంటే.. మరికొందరికి మాత్రం లక్షల్లో డబ్బును సంపాదించి పెడుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒక అమ్మాయి విషయంలో జరిగింది.

ఒక అమ్మాయి తన చిన్నతనంలో సరదాగా దిగిన ఫోటోను వేలం వేయగా, సుమారు ఐదు మిలియన్​ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3.3 కోట్లు) వెచ్చించి కొన్నాడో వ్యక్తి. అంత ఖరీదు చేసుకొనడానికి ఆ ఫోటోలో ఏముంది? అంత ఖరీదు చేసి కొనాల్సిన అవసరం ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..అమెరికాకు చెందిన జో రోత్​ అనే యువతికి ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఆమె 2005లో.. తనకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక కాలిపోతున్న భవనం ముందు నిలబడి ఫోటో దిగింది. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ ఫోటో ను రోత్ తండ్రి తీశాడు.

ఆ రోజు ఆ ఫోటో తీసిన ఆ తండ్రి తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఎప్పుడూ భావించలేదు.జేపీజీ మ్యాగజైన్​ నిర్వహించిన ‘ఎమోషన్​ క్యాప్చర్​’ కంటెస్ట్ వీరి జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ కంటెస్టెంట్ లో తన తండ్రి తాను తీసిన తన కూతురి ఫోటో పంపించారు. ఈ ఫోటో కంటెస్టెంట్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో అప్పటి నుంచి ఆమె ‘డిజాస్టర్ గర్ల్’గా ఫేమస్​ అయ్యింది.
యూనివర్సిటీ ఆఫ్​ కరోలినాలో చదువుకుంటోంది. 

‘ఓవర్లీ ఎటాచ్డ్​ గర్ల్​ ఫ్రెండ్​’, ‘బ్యాడ్​ లక్​ బ్రియన్’​ వంటి ఫేమస్​ మీమ్స్​ లక్షల డాలర్లకు అమ్ముడుపోయాయని తెలుసుకొని ఆశ్చర్యపోయిన వీరు తమ ఫోటోను కూడా వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 16న ఈ ‘డిజాస్టర్​ గర్ల్​ మీమ్’​ ఒరిజినల్​ ఫోటోను 24 గంటల వేలంలో పెట్టారు. అది ఏకంగా 4 లక్షల 70 వేల డాలర్లు అంటే మన భారత దేశ కరెన్సీ లో ఏకంగా మూడు కోట్లకు పైగా డబ్బును వెచ్చించి దుబాయ్​ కేంద్రంగా పనిచేస్తున్న ‘3 ఎఫ్ మ్యూజిక్’ అనే మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ సీఈఓ ఫర్జిన్ ఫర్దిన్ ఫార్డ్ వేలంలో దక్కించుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజన్లు ఈ ఫోటో అంత ఖరీదా అంటూ ఆశ్చర్యపోతున్నారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago