Meeting of CMs of Telugu states.. Key discussion on Godavari-Banakacharla project
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరుగనుంది. ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలకు, ప్రధాన కార్యదర్శులకు జలశక్తి శాఖ ఇప్పటికే సమాచారం పంపింది.
ఏపీ ప్రభుత్వం ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టును ప్రధాన అజెండాగా ప్రతిపాదించింది. కాగా, తెలంగాణ మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టును చర్చలో పెట్టకూడదని స్పష్టం చేసింది. పైగా బనకచర్లకు ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేవని, ట్రైబ్యునల్ తీర్పులను ఉల్లంఘిస్తూ అభివృద్ధి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చ జరగడం అనుచితమని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టుపై ఆమోదముద్ర వేయవద్దని కేంద్రాన్ని కోరింది.
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం స్వయంగా చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని, 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు తీసుకురావాలని ప్రతిపాదించింది.
రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కొత్త ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఏర్పడే ఎపెక్స్ కౌన్సిల్‌నే అసలు వేదికగా పేర్కొంది. గత పదేళ్లలో ఈ కౌన్సిల్ కేవలం రెండు సార్లే సమావేశమైంది. కాగా, తాజా భేటీలో భిన్న అభిప్రాయాల నేపథ్యంలో, కేంద్రం దశలవారీ చర్చలకు మార్గం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇద్దరు సీఎంల హాజరుతో జరగబోయే ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జలవివాదానికి ఒక కీలక మలుపు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…