నాగబాబు ఈ మధ్య వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి నిత్యం సోషల్ మీడియాలో కనబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగబాబు తన యూ ట్యూబ్ ఛానల్ పేరును మార్చేశాడు. గతంలో నాగబాబు స్వంత ఛానల్ కు ‘అంతా నా ఇష్టం’ అనే పేరు వుండగా.. లేటెస్టుగా తన ఛానెల్ పేరుని “మన ఛానెల్ – మన ఇష్టం” అని మార్చేశారు. కానీ ఇంత సడన్ గా నాగబాబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏమిటా.? అని అటు టాలీవుడ్ లోనూ.. అటు మెగా ఫ్యాన్స్ లోనూ సందేహాలు మొదలయ్యాయి. ఈ సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రేక్షకులకు కేవలం సమాచారాన్ని మాత్రమే అందివ్వడం కాకుండా వినోదాన్ని కూడా అందించాలనుకునే సదుద్దేశ్యంతోనే ఈ మార్పు చేసినట్లుగా నాగబాబు తెలియజేశారు.
ఇక అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ లో హీరోగా సక్సెస్ కాలేకపోయిన మెగా బ్రదర్ నాగబాబుకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చిన ప్రోగ్రామ్ జబర్దస్త్. ఈ కామెడీషో నుండి నాగబాబు కొన్ని కారణాల వలన తప్పుకుని మరో ఛానెల్ లో ‘అదిరింది’ అనే కామెడీ షోలో జాయినయ్యాడు. అయితే తాజాగా అందిన సమాచారం ఏమిటంటే.. ఇప్పుడు ‘అదిరింది’ షోకు ధీటుగా తనే సొంతంగా ఓ కామెడీ షోను ప్లాన్ చేస్తున్నాడట నాగబాబు. అయితే ఈ షోను నాగబాబు కొత్త టాలెంట్ పర్సన్స్ ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఉపయోగించబోతున్నారట. అలాగే ఈ షో ఇతర టీవీ ఛానెల్స్‌లో ప్రసారం కాదట.
నాగబాబు సొంత ఛానెలైన ‘మన ఛానెల్ – మన ఇష్టం’ అనే యూ ట్యూబ్ ఛానెల్ లోనే ప్రసారమౌతుందట. దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలోనే ఓ ప్రముఖ కమెడియన్ ప్రకటిస్తారని టాక్. జబర్దస్త్, అదిరింది షోల రేంజ్ లో నాగబాబు చేయబోయే సొంత షోలోనూ టీమ్ లీడర్స్ ఉంటారట. అనుభవం ఉన్న టీమ్ లీడర్స్ తో పాటు, కొత్తవాళ్లు కూడా జాయినవుతారట. ఇంతకీ ఈ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాదో తెలియదు కానీ.. అదిరింది షోలో మరి నాగబాబు పాల్గొంటాడా? లేదా? అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…