తెలుగు చిత్రరంగంలో మెగా కుటుంబానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి పది మందిలో ఐదుగురు మెగా ఫ్యాన్సే వుంటారంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అరడజను మంది హీరోలు వచ్చారు. అందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇప్పటికే తమదైన శైలిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లు శిరీష్ ఇంకా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.
వీళ్ళందరూ ఇలా ఉంటే తాను కూడా ఇదే కుటుంబం నుంచి వచ్చానంటూ నిహారిక కొణిదెల కూడా తన వంతు ప్రయత్నంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికని అందరూ ఇప్పుడు మెగా డాటర్ అని పిలుస్తున్నారు. మెగా కాంపౌండ్ లో హీరోయిన్ గా రంగప్రవేశం చేస్తున్న తొలి అమ్మాయి నిహారిక. ఆమె హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమా ‘ఒక మనస్సు’. ఆ తర్వాత 3 సినిమాల్లో నటించింది. తొలి సినిమా ఒక మనసు డిజాస్టర్ కాగా.. 2వ సినిమా హ్యాపీ వెడ్డింగ్, 3వది సూర్యకాంతం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కోలీవుడ్ లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో భాగంగా విజయ్ సేతుపతితో నటించిన చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో తనకు సినిమాలు కలసి రావడం లేదని ఒక నిర్ణయానికి వచ్చింది కొణిదెల నిహారిక. ప్రస్తుతం ఈమె సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తుంది. అందుకే ఆ వైపుగా కథలు వినడం మొదలు పెట్టింది.
ఇదిలావుండగా.. నిహారిక కొణిదెల గత కొన్ని రోజులుగా వరుస పెట్టి వార్తల్లోనే ఉంటుంది. ఈమధ్యనే ఆమె పెళ్లి కూడా కుదరడంతో నిత్యం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో నిహారిక పేరు వైరలవుతూనే ఉంది. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది నిహారిక. ఈమె చేసిన ఓ పని నెటిజన్స్ ఆగ్రహానికి గురి చేసింది. అంతలా నెటిజన్లు కోప్పడే విధంగా నిహారిక ఏం చేసిందబ్బా అనే కదా మీ సందేహం..? ఈమధ్య సినిమా ఛాన్సలు లేక.. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు బందైన నేపథ్యంలో నిహారిక ఒన్ ప్లస్ అనే చైనా మొబైల్ కు ప్రమోషన్ చేసింది. వన్ ప్లస్ ఫోన్‌కు బ్రాండింగ్ చేస్తూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్లు షేర్ చేసింది.
ఓ వైపు దేశమంతా చైనా ప్రాడక్ట్స్ బ్యాన్ చేయాలని చెప్తుంటే.. నువ్వు మాత్రం ఇలా చైనా ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తున్నావా.? నీకసలు బాధ్యత ఉందా.? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా.?
అసలు చైనా ఫోన్స్ అన్నీ తీసేయాలని ప్రభుత్వమే చెప్తుంటే నువ్వు మాత్రం ఏకంగా ఈ చైనా ఫోన్ వాడమంటూ ప్రమోట్ చేస్తావా.? ఇలా ప్రమోషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్.? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తెలిసి చేసిందో, తెలియక చేసిందో కానీ., నిహారిక మాత్రం చైనా మొబైల్ వివాదంలో భలే చిక్కుకుంది. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఈమె దగ్గర సమాధానం లేదిప్పుడు. త్వరలోనే ఈమె చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేయబోతుంది. ఆగస్టులో నిశ్చితార్థం.. డిసెంబరులో పెళ్లి ప్లాన్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…