Mega Star comments on Rajamouli : రాజమౌళి తో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.ఒక సినిమా తీశారు అంటే ఆ సినిమాలో ప్రతి సన్నివేషం అనుకున్న విధంగా వచ్చేవరకూ వదలరు అని అందరూ అంటుంటారు. అందుకే కాబోలు జూనియర్ ఎన్టీఆర్ ఈయనను జక్కన్న అని పిలుచుకుంటారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా తెర మీద పడే వరకు ప్రతి విషయం విన్న దగ్గరుండి చూసుకుంటారు. రాజమౌళితో సినిమాలో నటించడం కష్టమే అయినా అవకాశం వస్తే మాత్రం ఎవరు వదులుకోరు.
అయితే కొద్ది రోజుల నుంచి చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్లో సినిమా వస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ రూమర్ లకు చెక్ పెట్టారు
జక్కన్న తో టార్చర్ మాములుగా ఉండదు……
రాజమౌళితో సినిమా రూమర్లపై స్పందించిన మెగాస్టార్ ఇలా అన్నారు…. రాజమౌళినే తనతో సినిమా చేస్తాను అని అడిగిన తాను చేయనని చెప్పారు. రాజమౌళి తన సినిమాలో హీరో ని ఫిజికల్ గా టార్చర్ చేస్తారని, డైరెక్షన్లో సినిమా అంటే హీరో బాగా కష్టపడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఒక నటుడిగా నేను రాజమౌళి సినిమాలో నటిస్తే ఆయనను సంతృప్తి పరచలేని అందుకే ఆయనతో నేను సినిమా చేయదల్చుకోలేదు అని ఆయన చెప్పారు.
కానీ నాకు దర్శకత్వం ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని ఆయన కోరికను తెలియజేశారు. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నాను, త్వరలోనే ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు అని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఆయన తన వంతు సహాయంగా ఒక మినీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలియజేశారు. మొత్తానికి రాజమౌళి మెగాస్టార్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…