Categories: FeaturedMovie News

Megastar Chiranjeevi : నన్ను విమర్శించారని నా అభిమానులు వాళ్ళను రాళ్లతో కొట్టారు : మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi : ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్లకు ఆదర్శంగా నిలబడే స్థాయికి ఎదిగిన చిరు గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలను చూస్తూ ఆయనను అభిమానించే ఎన్నో కోట్లమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా ఇన్ని వేళ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడం లేదు. వేరొకరు ఆయన మీద బురదజల్లినా కూడా ఓర్పుగా వ్యవహారించారు కానీ ఎవరితోను పరుషంగా మాట్లాడలేదు. కానీ ఆయనను ఏమైనా అంటే ఆయన అభిమానులు మాత్రం ఆయనలా శాంతగా మాత్రం ఉండరు. ఇక ఇదే విషయాన్ని ఇటీవల మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.

నన్ను అలా అనేసరికి నా ఫ్యాన్స్ రాళ్లతో కొట్టారు…

చిరంజీవి గారిని అభిమానించేవారు కోట్లమంది ఉన్నా విమర్శించేవాళ్ళు లేకపోలేదు, అలానే ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినపుడు ఒక జర్నలిస్ట్ రాజకీయాల్లోకి మీరు పనికిరారు అన్నట్లుగా విమర్శలు చేయడంతో మెగాస్టార్ అభిమానులకు కోపం వచ్చి ఆయన కారు అద్దాలను రాళ్లతో కొట్టి పగలగొట్టారట. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి గారు మరుసటి రోజు ఉదయాన్నే సదరు వ్యక్తి ఇంటికి వెళ్లారట, నా మీద అభిమానంతో ఎవరో చేశారు చెయించింది నేను కాదు అంటూ చెప్పడానికి అక్కడికి వెళ్లారట. తప్పు చేయనప్పుడు వెళ్లి చెప్పడానికి వెనుకాడను అంటూ చెప్పారు చిరు.

ఒకరు విమర్శించి నిందలు వేస్తే వెంటనే స్పందించకపోవడం తక్కువ అయిపోవడం లేక వాళ్ళు అన్నమాటలు నిజం అని ఒప్పుకోవడం కాదు, నిజం నిలకడ మీద తెలుస్తుందని నమ్మేవాడిని నేను అంటూ చిరంజీవి గారు అభిప్రాయపడ్డారు. నిందలు వేశారని ఆవేశపడిపోయి మాట్లాడితే వారికీ నాకూ తేడా ఉండదు నేను తప్పు చేయనప్పుడు ఎందుకు ఆవేశపడాలి నిజం ఎప్పటికైనా నిలకడ మీద తెలుస్తుంది కదా అంటూ చెప్పారు. రాజకీయాల్లోకి వస్తాను అన్నపుడు కూడా మొదట బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు మీద విమర్శలు చేశారు. నేను నిజాలు నిదానంగా అందరికీ అర్థమవుతాయని ఊరుకున్నా, చివరికి అందరికీ ఆ విమర్శల్లో నిజమెంతో అర్థమైంది. కొంచెం ఆలస్యం అవ్వొచ్చేమో కానీ నిజం బయటికి వస్తుంది కదా అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago