Featured

Megastar praises Ram Charan : నా కొడుకు సత్తా ఉన్న నటుడు… రామ్ చరణ్ గురుంచి ఆసక్తికర వార్తలు చేసిన మెగాస్టార్…!

Megastar praises Ram Charan : రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తీసిన సినిమా ఆర్ఆర్ఆర్ . ఈ సినిమా ఘన విజయం తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న ప్రస్తుత చిత్రం ఆచార్య. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్నారు. ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న దర్శకుడు కొరటాల శివ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఎలా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ తన కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా కొడుకు సత్తా వున్న నటుడు….

తండ్రి కొడుకు ల కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మగధీర, బ్రూస్లీ వంటి రామ్ చరణ్ చిత్రాలలో మెగాస్టార్ కేసు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఎక్కువ సేపు ఆచార్య లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి రామ్ చరణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

చిరంజీవి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ….. చిన్నప్పుడు అందరూ నిక్కర్లు వేసుకునే వయసులో రామ్ చరణ్ వేసుకోవాలని మారం చేసే వాడని, అందరూ బొమ్మలు చొక్కాలు వేసుకోవడానికి ఇష్టపడితే చరణ్ మాత్రం ఎక్కువగా ఫార్మల్స్ వేసుకోవడానికి ఇష్టపడే వాడు అని చెప్పాడు. తను ఆలోచించే విధానం తన వయసుకు మించి ఉంటుంది అని కొడుకు గురించి చెప్పాడు. ఎదుటి వారితో మాట్లాడటం కంటే కూడా వాడి దగ్గర నుంచి నేర్చుకోవడమే ఎక్కువగా ఉండేది.

ఇక నటన పరంగా డైరెక్టర్ చెప్పినది చేస్తూ 100% ఇవ్వాలని అనుకుంటాడని, డైరెక్టర్స్ హీరో అనిపించుకోవడానికి ఇష్టపడతాడని చెప్పారు.
చరణ్ విషయంలో రాజమౌళి చరణ్ తెల్ల కాగితం లాంటివాడు అన్న మాటలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని, ఇదే మాట దర్శకుడు కొరటాల శివ కూడా రామ్ చరణ్ గురించి చెప్పాడని చిరంజీవి రామ్ చరణ్ గురించి చెప్పాడు. నా కొడుకు సత్తా ఉన్న నటుడు అంటూ రామ్ చరణ్ మెగాస్టార్ పొగడ్తలతో ముంచెత్తాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

9 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

9 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

9 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

9 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

9 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

9 hours ago