Singer parvathi eliminated : తెలుగు టెలి విజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన సంగీతం కార్యక్రమాల్లో జీ తెలుగులో వస్తున్న సరిగమప సింగింగ్ కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సీజన్ లో హోరాహోరిగా పోటీ జరుగుతోంది కంటెస్టెంట్స్ మధ్య. సింగర్ పార్వతికి ఈ షో లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె పాటతో తన ఊరికి బస్సు సౌకర్యాన్ని కల్పించింది పార్వతి. తన పాటతో బాగా ఫేమస్ అయిన పార్వతి పోటీలో చివరిదాకా ఉండి టైటిల్ విన్ అవుతుందని అందరు భావించారు. కానీ పార్వతి ఈ వారం ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది.
కంటెస్టెంట్స్ ఛాయిస్ రౌండ్ పేరిట 3 వారాలుగా షో సాగింది. కంటెస్టెంట్స్ తమకు నచ్చిన పాటలు పాడుతూ అందరిని అలరించారు.రౌండ్-1లో కీర్తన, ప్రణవ్ కౌశిక్, శృతిక, శివాని, అభినవ్ ఆకట్టుకున్నారు. వీరు ఎక్కువ మార్కులు సాధించి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇక శృతిక 89 పాయింట్లతో సత్తా చాటింది. ప్రణవ్ 85, కీర్తన 75 మార్కులు పొందారు. రౌండ్ -2లో అఖిల్, వినూత్న, కళ్యాణి, చరణ్, పార్వతి పాడారు . వీరిలో అఖిల్, వినూత్న, చరణ్ మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఇక పార్వతి 74, కళ్యాణి 67 మార్కులతో సరిపెట్టుకున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఛాయిస్ రౌండ్-3లో దీప్తీ భట్, ఆస్తా, వల్లి గాయత్రి, డానియెల్, వెంకట్ సుధాన్స్ తమ గాత్రంతో అలరించారు. కళ్యాణి అయితే కనీసం 70 మార్కులు కూడా తెచ్చుకోలేదు. ఇంక కీర్తన, పార్వతి, కళ్యాణిలు షో నుంచి ఎలిమినేట్ అయినట్లు ఎస్పీ శైలజ వెల్లడించారు.
ఇక పార్వతి ఎలిమినేషన్ అందరిని బాధపెట్టింది. కానీ పార్వతి మాత్రం ఇలా షో కి నవ్వుతూ వచ్చిందో అలాగే నవ్వుతూ షో కి వీడ్కోలు పలికింది. ఇక పార్వతి మాట్లాడుతూ ఎస్పి బాలు ముందు పాడాలనే కోరిక తీరలేదు కాని ఎస్పి శైలజ ముందర పాడటం చాలా ఆనందంగా ఉందని చెప్పి షో కి వీడ్కోలు పలికింది. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి షోలోకి అడుగుపెడుతుందని ఫ్యాన్స్, అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…