Featured

మెగాస్టార్ చిరంజీవి నాన్నగారు కూడా ఒక సినిమాలో నటించారని మీకు తెలుసా..?!

చిరంజీవి మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటనలో శిక్షణ పూర్తి కాకముందే ఆయనకు పునాదిరాళ్లు చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి హైదరాబాద్ కు చెందిన గూడపాటి రాజ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా తొలిషాట్ లో పొలంలో తన నలుగురు స్నేహితులతో చిరంజీవి పని చేస్తూ ఉంటాడు. రియలిస్టిక్ గా ఉండడానికి చిరంజీవి మిగతా వారిలా కాకుండా తన తలపై గడ్డిపోచలు వేసుకొని కనిపించడం చూసిన కెమెరామెన్, చిరంజీవిని దగ్గరకు పిలిచి భవిష్యత్ లో పెద్ద హీరో అవుతావని చెప్పాడు. ఒకరోజు ఈ సినిమా షూటింగ్ వర్షం కారణంగా ఆగిపోయింది.

దర్శకుడు రాజ్ కుమార్ ప్యాకప్ చెప్పి అక్కడే పల్లెటూరిలోని ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా.. పక్కగదిలో చిరంజీవి టేప్ రికార్డర్ పెట్టుకొని ఓ పాటకు డాన్స్ చేయడం చూసిన దర్శకుడు రాజ్ కుమార్ పునాదిరాళ్లు చిత్రంలో చిరంజీవికి ఒక పాటను కేటాయించారు. ఆ తర్వాత దర్శకుడు బాపు చిరంజీవి ఎర్రనికళ్ళను చూసి తను తీయబోయే మన ఊరి పాండవులు చిత్రంలో ఐదుగురు హీరోలలో ఒకరిగా చిరంజీవిని తీసుకున్నారు. ఆ రోజుల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి నటన చూసి ఆయనతో మళ్లీ ఒక సినిమా తీయాలని బాపుగారు అనుకున్నారు. అలా జయకృష్ణ నిర్మాతగా బాపు దర్శకత్వంలో మంత్రిగారి వియ్యంకుడు అనే చిత్రంలో చిరంజీవి, పూర్ణిమజయరాం హీరో హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ చిత్రంలో మంత్రి గా నటించడానికి ఎవరైతే బాగుంటుందని దర్శకుడు బాపు ఆలోచిస్తున్న తరుణంలో.. అదే చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న అల్లు రామలింగయ్య ఎవరో ఎందుకు మా బావగారు ఆ పాత్రను పోషిస్తారని చిరంజీవి తండ్రి కె.వెంకటరావును చూపించడం జరిగింది. అలా ఆ చిత్రంలో కె.వెంకట్ రావు ఒక సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. అయితే చిరంజీవి నాన్నగారైన వెంకటరావు కి ఇదే తొలి చిత్రం అని చెప్పలేము. 1969లో జగత్ జెట్టీలు అనే చిత్రంలో ఆయన మొదటగా నటించారు. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించినప్పటికీ కుటుంబ బాధ్యతల వల్ల ఆయన సినిమాల్లో తిరిగి నటించాలని అనుకోలేదు. పైగా ఎక్సైజ్ డిపార్ట్మెంటులో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించడం వలన సినిమాల్లో నటించే సమయం లేకుండా పోయింది.

కానీ సినిమా రంగంలో తన కొడుకులు అభివృద్ధి చెందాలని ఎప్పుడు కోరుకునేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1983 లో అల్లు రామలింగయ్య కోరిక మేరకు చిరంజీవి సినిమా అయినా మంత్రిగారి వియ్యంకుడులో ఒక సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. తర్వాత ఆయన తిరిగి ఏ చిత్రంలో నటించలేదు. ఆయన కోరుకున్నట్టుగానే పెద్దకొడుకైన చిరంజీవి సుప్రీం,మెగాస్టార్ గా చిత్ర సీమలో నెంబర్ వన్ హీరోగా ఉన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago