Mehaboob Dil Se: గుంటూరులో మెహబూబ్ హోమ్ టూర్.. ! ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో.. వీడియో వైరల్!
Mehaboob Dil Se: బిగ్ బాస్ షో అప్పటి వరకు కొంత మందికి తెలిసిన వ్యక్తులను ఏకంగా సెలబ్రెటీలుగా.. ఓవర్ నైట్ స్టార్లను చేస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన కిక్ తో వరసగా సినిమా, సీరియల్, రియాలిటీ షో ఆఫర్లు దక్కతున్నాయి. ఇప్పటికే వీజే సన్నీ.. సకలగుణాభిరామ పేరుతో ఓ సినిమా కూడా చేశారు.
ఇక సోహెల్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే చాలా రోజులు కష్టాల్లో ఉన్నవారికి బిగ్ బాస్ ఉపశమనాన్ని ఇచ్చింది. వాళ్ల కలలకు రెక్కలు తొడిగింది. ఇలా తన కలను నెరవేర్చుకున్నాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే.
మెహబూబ్ కేవలం యూట్యూబర్ కే కాకుండా.. టాలెంటెడ్ యాక్టర్, డ్యాన్సన్ కూడా. ఇల్లు కట్టుకోవాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. బిగ్ బాస్ షో అతని కలకు పునాది వేసింది. దీనికి తోడు తనగా కుటుంబ కష్టార్జితం తోడు కావడంతో సొంతిళ్లును కట్టుకున్నాడు.
గుంటూర్ లో ఉన్న తన ఇళ్లును చూపిస్తూ హోం టూర్ చేశాడు. ఈ ఇల్లు కట్టడానికి 16 నెలలు పట్టిందని… కరోనా కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు గదులు ఏర్పాటు చేసి దుకాణాల కోసం రెంట్ కు ఇచ్చే విధంగా నిర్మించారు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో చిన్న హాల్, కిచెన్, సింగిల్ బెడ్రూం మాత్రమే ఉన్నాయి. మొదటి అంతస్తులో కిచెన్, హాల్ తో పాటు విశాలమైన రెండు డబుల్ బెడ్రూంలను నిర్మించారు. మెహబూబ్ తన అభిరుచికి తగనట్లు కబోర్డ్, వాల్ పేపర్లను డిజైన్ చేయించుకున్నాడు.
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం కొత్తగా పెద్దగా భర్తీకి అడుగులు వేస్తోంది. రకాల…
వేసవి కాలం ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. ఫిబ్రవరి చివరినుంచే పలుచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు…
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…