టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా మైక్ టైసన్ కు సంబంధించిన లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు.
ఈనెల 12వ తేదీన చిత్ర బృందం అమెరికాకు చేరుకోగా ప్రస్తుతం మైక్ టైసన్ అలాగే విజయ్ దేవరకొండ మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు పూరి జగన్నాథ్. తాజాగా మైక్ టైసన్ లైగర్ చిత్ర బృందంతో కలిసాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మైక్ టైసన్ తో కలిసి కొంచెం వెరైటీగా ఫోటో దిగాడు. అతనితో కలిసి పనిచేయడం పై సంతోషం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ ఈ మెమోరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటాను అని తెలిపాడు.
ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా, హీరోయిన్ ఛార్మి అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇలా ఈ చిత్ర మొత్తం బృందానికి లైగర్ తొలి పాన్ ఇండియా మూవీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…